ఒక చెరువు గట్టు పై మూడు కప్పలు కూర్చుని ఉన్నాయి. అందులో రెండు కప్పలు కూర్చోవడం పై విసుగెత్తి చెరువులోకి దూకాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు గట్టుపై ఎన్ని కప్పలు ఉంటాయి? మీరు చెప్పే సమాధానం "ఒకటే ఉంటుంది అని"ఐతే కనుక మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చదవండి. మిత్రులారా! జీవితంలో కూడా అంతే. మనం ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాము అనేదానికన్నా మన నిర్ణయాన్ని మనం ఎంత వరకూ అమలు పరుస్తున్నాం అనేదానిమీదే మన జీవితంలో మార్పు కానీ, అభివృధ్ధి కానీ ఆధారపడి ఉంటుంది. గొప్ప గొప్ప ఆలోచనలు అందరూ చేయగలరు, కానీ వాటిని కొంతమంది మాత్రమే అమలు చేయగలరు. వారినే అచ్చ తెలుగులో ధీరుడు అంటారు. చాలా కాలం క్రితం నేను మా గురువు గారి క్లాసులో మొదటి సారి కూర్చున్నప్పుడు,చాలా విషయాలు చెబుతూ మధ్యలో ఆయన సడెన్ గా జేబు లోంచి ఒక 500 నోటు తీసారు. దాన్ని పైకి పట్టుకుని, ఇది ఇక్కడ ఉన్న వారిలో ఒకరికి ఇద్దామనుకుంటున్నాను, ఎవరికి కావాలి? అన్నారు. కూర్చుని ఉన్నవారిలో ( నాతో సహా) రకరకాల ఆలోచనలు.... అసలు ఇస్తాడా? లేకపోతే సరదాగా జోక్ చేస్తున్నాడా? అసలు అలా ఎవరైనా ఇస్త...
Comments
Post a Comment