మీరు ఈ విధమైన ఆలోచనా విధానానికి మీరు బందీలా?

మీరు విధమైన ఆలోచనా విధానానికి మీరు బందీలా?

ఒక సారి ఒక శాస్త్రజ్ణుడు గొంగళి పురుగుల ప్రవర్తన పై పరిశోధన చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని గొంగళి పురుగులని ఒక పళ్ళెములో ఒక దాని వెనుక ఒకటి ఉండేలా గుండ్రంగా అమర్చారు.

పళ్ళెం మధ్యలో వాటికి కావలసిన ఆహారం అమర్చారు.

గొంగళి పురుగులు దేనంతట అది తన ముందు ఉన్న పురుగు ఆహారం దిశగా వెళుతుంది అనుకుని దానిని ఫాలో అవసాగింది. కాని అన్నీ అలాగే అనుకుని ముందు ఉన్న దానిని ఫాలో అయ్యాయి.

తంతు ఇలాగే వారం పాటు కొనసాగింది. ఆహారం లేక నీరసంతో ఒక్కొక్కటి చనిపోసాగాయి. చివరికి మూర్ఖపు చర్యతో అన్నీ చనిపోయాయి.

అవి చావకుండా ఉండాలంటే తాము చేస్తున్న మూర్ఖపు చర్యని ఆపి, ఆరు అంగుళాలకంటే దగ్గరగా ఉన్న ఆహారం దిశగా వెళ్ళి ఉంటే అన్నీ బ్రతికి ఉండేవి.

కానీ అవి అన్నీ ఒక జీవనవిధానానికి అలవాటు పడి అదే విధానంలో జీవితం సాగించాయి. చివరికి మరణించాయి.

కధలో నేర్చుకోవలసిన పాఠాలు

అవి ఎంత సేపు మేము  నడుస్తున్నాము, కాబట్టి ఎంతో కొంత సేపటికి మా లక్ష్యానికి చేరుకుంటాము అనే భ్రమలో శ్రమించాయి.

అవి గొంగళి పురుగులు వాటికి ఆలోచనా శక్తి లేదు. తమ చర్య తాము ఆశించిన ఫలితాన్నే ఇస్తుందన్న భ్రమలో కష్టపడ్డాయి

మనం మనుష్యులం.కాబట్టి మనం ఇలా ప్రవర్తించం,అవునా?

నిజమేనా? ఒక్కసారి నిజాయితీగా అలోచిద్దామా?

మనిషి మాత్రమే తన జీవిస్తున్న విధానాన్ని మార్చుకోగలిగే శక్తి కలిగి ఉంటాడు. మరి మనం నిజంగా శక్తిని వాడుతున్నామా?

చాలా సార్లు మనం శ్రమకు ఫలితానికి గల సంబంధాన్ని మరిచిపోతాము.
మనిషి మాత్రమే తన జీవిస్తున్న విధానాన్ని మార్చుకోగలిగే శక్తి కలిగి ఉంటాడు. మరి మనం నిజంగా శక్తిని వాడుతున్నామా?

చాలా సార్లు మనం శ్రమకు ఫలితానికి గల సంబంధాన్ని మరిచిపోతాము.
ఎప్పుడైతే మనం విషయాన్ని గమనించకుండా అజాగ్రత్తగా ప్రవర్తిస్తామో మనం డబ్బు పరంగా నష్టపోతాము.

అంతే కాక మనం గానుగకి కట్టిన ఎద్దులా ఎంత శ్రమ పడ్డా దాని జీవితం అంతే అయినట్లు, పళ్ళెం లో గొంగళి పురుగుల్లా జీవితాన్ని సాగిస్తుంటాము.

కానీ మనం సరిగ్గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు దేవుడు ఆలోచనాశక్తిని వరంగా ఇచ్చాడు.దానితో మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోగల సమర్ధత వచ్చింది. దాన్ని మనం అసలు ఉపయోగిస్తున్నామా?

మనం చేసే శ్రమకు, మనకు వచ్చే ఆదాయానికి పోలిక ఉందా?

మనం ఆశించిన జీవితం ఇదేనా?

మరి మనం దాని దిశగా ఏమైనా చర్యలు తీసుకొంటున్నామా?

డబ్బు పరంగా మన  మనసులో ఉన్న భ్రమలు, భయాలు పోనంతవరకూ 

మనం మన పూర్తి సమర్ధతతో పనిచేయలేము, ఫలితాన్ని ఆశించలేము.

Comments

Popular posts from this blog

Why To Convince?