పుల్లని ద్రాక్ష పళ్ళు



నక్క - పుల్లని ద్రాక్ష పళ్ళు కధ గుర్తుందా?

ఆశ పడిన నక్క ఎంతకీ అందక పోయేసరికి చివరికి "ఛీ, ద్రాక్షపళ్ళు పుల్లగా ఉంటాయి" అని తేల్చేసి వెళ్ళి పోతుంది.

మిత్రులారా! డబ్బు విషయంలో మనిషి ప్రవర్తన కూడా అంతే.
సంపాదించాలని ప్రతి వ్యక్తికీ ఉంటుంది. ప్రయత్నించి సంపాదించలేక పోయిన ప్రతి వ్యక్తీ దానికి కారణంగా డబ్బునే తప్పు పడతాదు.

ఫలితం : డబ్బు అన్ని అనర్ధాలకి మూలం, డబ్బు పట్ల కోరిక మంచిది కాదు,ప్రపంచంలో డబ్బే సర్వస్వం కాదు.వగైరా వగైరా స్టేట్మెంట్లు పుట్టుకొస్తాయి.

నిజానికి డబ్బు సంపాదించడం చేతకాని వాడే ఇలాంటి ప్రచారం చేస్తాడు, నిజమని నమ్ముతాడు.

మీరు కూడా అలాగే డబ్బుని,పరిస్థితులని నిందిస్తారా? లేక
సంపాదించడం నేర్చుకుంటారా? ఆలోచించండి?

Comments

Popular posts from this blog

విజయ లక్ష్మి ధీరుడిదే

What is entrepreneurship?