మంచితనం Vs డబ్బు

మంచితనం  Vs డబ్బు

ఒక చాలా మంచి వ్యక్తి, చాలా చెడ్డ వ్యక్తి చదరంగం ఆడుతున్నారు. ఎవరు గెలుస్తారు?

మన కోరిక మంచివాడు గెలవాలి, చెడ్డవాడు ఓడిపోవాలి అని.

కాని నిజం ఏమిటంటే ఎవరికి ఆట బాగా వస్తే వాళ్ళే గెలుస్తారు.
మంచితనానికి ఆట గెలవడానికి సంబంధం లేదు.

మంచితనం వేరు, ఆట గెలిచే సమర్ధత వేరు.
డబ్బు విషయం కూడా అంతే.

మన మంచితనానికి, టాలెంట్ కి,నాలెడ్జ్ కి డబ్బు సంపాదించే సమర్ధతకి సంబంధం లేదు.

అందుకే మన చుట్టు పక్కల చాలా మంది మూర్ఖులు,చెడ్డవారు,అసమర్ధులు కూడా డబ్బు సంపాదించే సమర్ధత కలిగి ఉండటం వల్ల వారి దగ్గరికే డబ్బు వచ్చి చేరుతూ ఉండటాన్ని గమనించవచ్చు.

మన వరకూ మనం " మంచి వారికే దేవుడు అన్ని కష్టాలు పెడతాడు" అనుకుంటూనో లేకపోతే  "వాడు ఏదో ఫ్రాడ్ చేసి ఉంటాడు, లేక పోతే ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ సంపాదించలేం" అనుకుంటూనో  మన అసమర్ధతని కప్పి పుచ్చుకుంటూ కాలం గడిపేస్తాం.దేవుడి ని నిందిస్తాం.

డబ్బు సంపాదించే సమర్ధత ఏ ఒక్కడి స్వంతం కాదు.ఆ కిటుకులు తెలిస్తే ఎవరైనా ధనవంతులు కావచ్చు. పట్టుదలతో, క్రమశిక్షణతో క్రమం తప్పకుండా ఆ సూత్రాలు పాటిస్తే చాలు. 
Regards,
Raajh Shekhar

Corporate Trainer , Author &  Life Coach
91 8186 0000 39 / 91 960 333 7131

41981971981
DIVINE MAGIC BEGIN NOW


Comments

Popular posts from this blog

What is entrepreneurship?

విజయ లక్ష్మి ధీరుడిదే