ఒకావిడ ఒంటరితనంలో తనకు తోడుగా ఉంటుందని ఒక షాప్ నుంచి ఒక చిలుక కొనుక్కుని వెళ్ళింది . మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చి షాప్ అతనితో " నా చిలుక అసలు మాట్లాడటము లేదు , ఆడటం లేదు " అని చెప్పింది . షాప్ అతను " మీరు దాని పంజరంలో ఒక అద్దం పెట్టండి , చిలుకలు అద్దంలో చూసుకుంటూ మాట్లాడతాయి " అని ఒక అద్దం అమ్మాడు . ఆవిడ మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి , ఇంకా మాట్లాడటము లేదు , ఆడుకోవటంలేదు అని చెప్పింది . దానికి షాప్ అతను " అలాగా ! కొన్ని చిలుకలు పంజరంలో నిచ్చెన పెడితే బాగా హుషారుగా ఉంటాయి , ట్రై చెయ్యండి " అని నిచ్చెన ఇచ్చాడు . మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి ఆమె నీరసంగా " ఇంకా ఏమీ చేయటము లేదు " అని చెప్పింది . " మేడం ! మీరు ఉయ్యాల పెట్టండి , ఊగుతూ హుషారుగా కబుర్లు చెబుతుంది " అని ఉయ్యాల ఇచ్చాడు . ఆవిడ తిరిగి మర్నాడే వచ్చింది . షాప్ అతను ఆత్రుతగా " మేడం , ఇప్పుడు చిలుక ఓకేనా ? " అని అడిగాడు . ఆవిడ బాధగా చిలుక చనిపొయింద...